telugu

శ్రీకర కవితలు- 2

కష్టాల్లో చేతి గీతలను నమ్మే ఓ మూర్ఖుడా!!
కష్టాన్ని ఇష్టంగా పుస్తకంలో రాసి చూడు.
కష్టపడి రాసిన ఆ రాతల్లోంచి నీకు వెలుగు కనిపిస్తుంది.
కార్చిన ఆ కష్టం ఎప్పటికీ కరువవ్వదు అని తెలుస్తుంది!!


జీవితాన్ని జయించాలి అనుకోని,
జీవించటం మర్చిపోయావా??
జీవితం అంటే సంపాదించటం కాదు!!
జీవితాన్ని జీవించటం అని తెలుసుకో నేస్తమా!!.

ఒంటరిని అని బాధ పడుతున్నవా??
ఒంటరి కని వారు ఎవరు అని గుర్తించలేక పోతున్నవా?? ఐతే!!
వెలుగునిచ్చే సూర్యుడు కదా ఒంటరి!!
వెన్నలని ఇచ్చే చంద్రుడు కదా ఒంటరి!!
ఏమంటావు ఓ నేస్తం??

ఇది తప్పు, ఇది ఒప్పు అని ఎవరు చెప్పారు??
ఇక్కడి తప్పు, అక్కడ ఒప్పు!!
అక్కడి ఒప్పు, ఇక్కడ తప్పు!!
తప్పు ఒప్పుల మన శృష్టిలో…
తప్పక చేసే తప్పు ఒప్పే!!!
తప్పించుకు చేయని ఒప్పు తప్పే!!!!
మరి ఏది తప్పు, ఏది ఒప్పు??
ఇదే మరి తప్పొపుల ముప్పు…..

ఎవరు పడని కష్టం నువ్వు పడ్డపుదే,
ఎవరు జీవించలేని జీవితం జీవిస్తావు .


Maleగా పుట్టిన male లేని జీవితాలు మనవి 😅
Fe(w)maleగా పుట్టిన ఎంతో male ఐనా జీవితాలు మీవి😬

నచ్చుతాయి అని ఆశిస్తూ……
ఇట్లు మీ,
శ్రీ
🙏
——————————————————————–
గమనిక: తెలుగు భాషలో కవితలు రాయాలని చాలా రోజులుగా సాగుతున్న నా ఈ చిన్ని ప్రయత్నంలో నేను రాసిన ఈ జీవిత సత్యాల లోని భాష్యం మీకు నచ్చిందని భావిస్తున్నాను. నచ్చితే మీ అభిప్రాయాన్ని కింద ఉన్న కామెంట్స్ లలో తెలుపగలరు.

Advertisement

4 thoughts on “శ్రీకర కవితలు- 2”

Comments are closed.